store banner



entertainment
By asianet news Telugu Team | 09:30 PM August 12, 2017
తాప్సీ కోసం ప్రభాస్

Highlights

  • తాప్సీ కోసం రంగంలోకి దిగుతున్న ప్రభాస్
  • ఆనందో బ్రహ్మ సినిమాతో వస్తోన్న తాప్సీ
  • ఈ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ప్రభాస్ వస్తున్నాడని సమాచారం

బాహుబలి మూవీతో దేశవ్యాప్తంగా క్రేజ్ సంపాదించిన హీరో ప్రభాస్ ఆ తర్వాత ఎక్కడా కనిపించకుండా పోయాడు. సాహో షూటింగ్ లో బిజీగా వున్నట్లు చెప్తున్నా... కనీసం రాఖీ పౌర్ణమి నాడు తమక్కూడా దొరకలేదని.. ప్రభాస్ సిస్టర్స్ చెప్పారంటే ప్రభాస్.. తన లుక్ రివీల్ కాకుండా ఏ రేంజ్ లో డిస్టన్స్ మెయింటైన్ చేస్తున్నాడో తెలుసుకోవచ్చు. బాహుబలి 2 సక్సస్ తరువాత ప్రభాస్ టాలీవుడ్ కు సంబంధించిన ఏ ఫంక్షన్ లో కనిపించలేదు.

 

కరణ్ ఇచ్చిన బాహుబలి బాలీవుడ్ సక్సెస్ పార్టీలో కనిపించిన ప్రభాస్ మళ్లీ సోషల్ మీడియాలో వదిలిన రెండు న్యూ లుక్ పిక్స్ తప్ప మరే సమాచారం లేదు. అయితే తాజాగా హీరోయిన్ తాప్సీని ప్రమోట్ చేస్తూ.. ప్రభాస్ రంగంలోకి దిగుతున్నాడని వార్తలు రావడం ఆసక్తిగా మారింది. ఈనెల 18న విడుదల కాబోతున్న కామెడీ హారర్ సినిమా ‘ఆనందో బ్రహ్మ’ ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ప్రభాస్ ఛీఫ్ గెస్ట్ గా హాజరవుతున్నాడనే న్యూస్ ఇప్పుడు హాట్ టాపిక్ అయింది. 

 

ఈ సినిమాలో తాప్సీ మెయిన్ లీడ్ గా యాక్ట్ చేస్తోంది అన్న విషయం తెలిసిందే. ఆమెతో పాటు మరో నలుగురు కమీడియన్లు ఈ సినిమాలో నటిస్తున్నారు. అయితే ప్రభాస్ ఈమూవీ ప్రీ రిలీజ్ ఫంక్షన్ కు ఛీఫ్ గెస్ట్ గా రావడం వెనుక తాప్సీ ఒత్తిడి అని అంటున్నారు. ఈనెల 14న పార్క్ హాయత్ లో ఈ సినిమా ఫంక్షన్ జరగుతుందని సమాచారం. 

 

గతంలో తాప్సీతో నటించినప్పటి నుంచి వీరిద్దరి మధ్య స్నేహం కొనసాగుతోందని అంటుంటారు. ఇపుడు తన ఫ్రెండ్ తాప్సీ కోరిక మేరకే ఆ సినిమా ఫంక్షన్ కి ప్రభాస్ వస్తున్నాడని వర్గాల టాక్.

 

ఇప్పటికే  ‘ఆనందో బ్రహ్మ' సాంగ్‌ ప్రోమోకు మంచి స్పందన వచ్చింది. ఈసినిమాలో తాప్సీ అందంగా కనిపిస్తూనే, భయపెట్టేస్తుందట. ఇప్పటికే ‘ఆనందో బ్రహ్మ' కి మంచి క్రేజ్ వచ్చింది. దీనికితోడు ప్రభాస్ క్రేజ్ కూడ కలుస్తోంది కాబట్టి ఈ మూవీకి మంచి ఓపెనింగ్స్ రావటం ఖాయంగా కనిపిస్తోంది.

 

Show Full Article


Recommended


bottom right ad