store banner



రంగస్థలం 1985 చిత్ర షూటింగ్ లో గాయపడ్డ రామ్ చరణ్
entertainment
By asianet news Telugu Team | 06:12 PM June 19, 2017
  • రంగస్థలం మూవీ షూటింగ్ లో గాయపడ్డ మెగా పవర్ స్టార్ రామ్ చరణ్
  • సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న రంగస్థలం 1985
  • ఈ చిత్రంలో హీరోయిన్ గా నటిస్తున్న సమంత

 

మెగా పవర్ స్టార్ రామ్‌చరణ్‌ కథానాయకుడిగా సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం ‘రంగస్థలం’. సమంత కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం షూటింగ్‌ రాజమహేంద్రవరం సమీపంలోని ఓ మారుమూల పల్లోలె జరుగుతోంది. ఈ చిత్ర షూటింగ్ చాలా కఠినమైందని, సూర్యోదయాని కన్నా ముందే చిత్రీకరణ ప్రారంభమై, సూర్యాస్తమయం అయ్యేవరకూ షెడ్యూల్ సాగుతోందని చిత్ర బృంద చెబుతోంది.

 

కాగా సినిమాకు సంబంధించి ఓ కీలక సన్నివేశాన్ని చిత్రీకరిస్తుండగా, రామ్‌చరణ్‌కు స్వల్ప గాయాలయ్యాయని సమాచారం. వాటిని లెక్క చేయకుండా చెర్రీ షూటింగ్‌లో పాల్గొంటున్నారని చిత్ర బృందం చెబుతోంది. ఈనెలాఖరు వరకు ఈ షెడ్యూల్‌ జరగనుంది. తర్వాతి షెడ్యూల్‌ హైదరాబాద్‌లో ప్రారంభం కానుంది. ఆర్ట్ డైరెక్టర్ రామకృష్ణ సినిమా సెట్‌ల బాధ్యతలను పర్యవేక్షిస్తున్నారు. ‘రంగస్థలం’ చిత్రానికి దేవీశ్రీ ప్రసాద్ స్వరాలు సమకూరుస్తున్నారు. ఆది పినిశెట్టి, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. పల్లెటూరి నేపథ్యంలో సాగే ఈ చిత్రాన్ని రంగస్థలం 1985 అనే టైటిల్ కింద రూపొందిస్తున్నారు.

Show Full Article