store banner



ఎన్టీఆర్ బిగ్ బాస్ టీజర్.. బాండ్ తరహాలో అదుర్స్ అనిపిస్తున్న జూనియర్
entertainment
By asianet news Telugu Team | 02:14 PM June 19, 2017
  • స్టార్ మాలో ఎన్టీఆర్ హోస్ట్ చేస్తున్న బిగ్ బాస్ షో
  • తాజాగా ఈ షోకు సంబంధించిన టీజర్ రిలీజ్
  • బాండ్ తరహాలో అభిమానులను ఆకట్టుకుంటున్న ఎన్టీఆర్

యంగ్ టైగర్ ఎన్టీఆర్ త్వరలో తెలుగు బుల్లితెరపై రాబోతున్న 'బిగ్ బాస్' రియాల్టీ షో ద్వారా బుల్లితెర ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. స్టార్ మాటీవీలో ప్రసారం కాబోతున్న ఈ షోకి సంబంధించిన టీజర్ తాజాగా రిలీజైంది. అద్భుతమైన బ్యాగ్రౌండ్ స్కోర్, గ్రాఫిక్స్‌తో ఈ టీజర్ డిజైన్ చేశారు. జేమ్స్ బాండ్ తరహాలో ఎన్టీఆర్ ఈ టీజర్ లో కననిపిస్తున్నారని, అలాంటి పాత్రలకు జూనియర్ బాగా సూటవుతాడని అభిమానులు అంటున్నారు.

 

బిగ్ బాస్ షో గురించి మాట్లాడుతూ.. ‘టెలివిజన్‌ ఇపుడు అతి పెద్ద ఎంటర్టెన్మెంటుగా మారింది. తెలుగు టెలివిజన్‌లో అతిపెద్ద షోగా వస్తున్న ‘బిగ్‌ బాస్‌' కోసం నన్ను సంప్రదించినప్పుడు ఈ సవాలు నాకు ఆసక్తిగా అనిపించింది. ఈ షో ఓ గేమ్‌ ఛేంజర్‌లా మారుతుందన్న నమ్మకం నాకు కలిగింది' అన్నారు ఎన్టీఆర్.

 

ఈ రియాల్టీ షోలో మొత్తం 12 మంది పోటీ పడనున్నారు. వీరందరినీ ప్రత్యేకంగా నిర్మించిన ఓ ఇంట్లోకి పంపించి తాళం వేస్తారు. వారి కదలికలను సిసి కెమెరాల ద్వారా పర్యవేక్షిస్తుంటారు. హిందీలో సల్మాన్ హోస్ట్ చేసిన బిగ్ బాస్ లో సామాన్యులు, సెలబ్రిటీలు కలిసి పాల్గొనే వారు. అయితే.. తెలుగులో ఇదే మొదటి సీజన్ కాబట్టి ప్రస్తుతానికి సామాన్యులకు అవకాశం లేదు. కేవలం సెలబ్రిటీలతోనే తొలి సీజన్ నిర్వహించబోతున్నారు.

 

బిగ్ బాస్ హౌస్ లో బతికేందుకు కావాల్సిన అన్ని సదుపాయాలు ఉంటాయి. కానీ సెల్‌ఫోన్, టీవీ, దినపత్రికలు వంటివి వారికి అందుబాటులో ఉండవు. బయటి ప్రపంచంతో అసలు ఎలాంటి సంబంధాలు ఉండవు. ఒక భిన్నమైన పరిస్థితుల్లో బిగ్ బాస్ హౌస్ లో గడుపుతున్న వారి.. భావోద్వేగాలు ఎలా ఉంటాయో చూపడమే వినోదం. విభిన్న రంగాలకు చెందిన, భిన్నమైన అభిరుచులు కలిగిన పలువురు సెలబ్రిటీలు ప్రపంచంతో సంబంధం లేకుండా ఒకే చోట ఎలా గడుపుతారన్నదే ఈ షోలో ప్రేక్షకులను ఆకట్టుకునే అంశం.

Show Full Article